:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / telangana / Nalgonda

బహుజన జర్నలిస్టుల సంక్షేమమే మా లక్ష్యం..

By Vinod Kumar | Posted on: 28-08-2023 20:08 | : 409



 

  • ఎంజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్

నల్లగొండ, ఆగస్టు 29 (వుదయం ప్రతినిధి): మాదిగలతో పాటు బహుజన జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తన వంతుగా కృషి చేస్తానని ఎంజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గాదె రమేష్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన గాదె రమేష్ ను జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక టీఎన్జీవో భవన్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాలుగా ఉన్న కొన్ని సంఘాలు అధికార పార్టీల అడుగులకు మడుగులోత్తుతూ కొన్ని సంఘాలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయి తప్ప వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు సైతం తమ గెలుపు కోసం ఎంతో శ్రమపడి యాజమాన్యాల ఒత్తిడిలను లెక్కచేయకుండా వారి గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేసిన జర్నలిస్టులను సైతం మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగ  నాయకత్వంలో బహుజన జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా తన వంతుగా కృషి చేస్తానని బహుజన జర్నలిస్టులంతా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపల్లి బిక్షపతి, టీఎన్జీవోస్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ,బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, ఎం జె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మహంకాళి బిక్షం, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కట్టెల శివకుమార్, ఎం జె ఎఫ్ నల్గొండ జిల్లా నాయకులు ఆడపు పరమేష్, పగడాల నాగయ్య, కందుల మోహన్,ఎం జె ఎఫ్ బోనగిరి జిల్లా ఇన్చార్జి 

ఉదరి శ్యామ్, కురుపాటి శ్రవణ్ కుమార్ ,బొంగరాల మట్టయ్య ,బక్క అమరేందర్, మద్దిమడుగు సదానందం ,ఇండియా సంస్థ రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు గద్దపాటి సురేందర్, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు కొమిరే స్వామి, ఎమ్మార్పీఎస్ జిల్లా కో- కన్వీనర్ ఈరిగి శ్రీశైలం, ఎంఈఎఫ్ నాయకులు జీడిమెట్ల రమేష్ ,చింత శివశంకర్, ఈరిగి మధు, కొండేటి మురళి తదితరులు పాల్గొన్నారు.