:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / telangana /

పేదల గుడిసెలను తగాలబెట్టిన భూకబ్జాదారులపై కేసులు నమోదు చేయాలి

By Admin | Posted on: 02-09-2023 20:09 | : 286



అక్రమ పట్టాలను రద్దుచేయాలి
గుడిసెలు వేసుకున్న పేదలకు రక్షణ కల్పించాలి
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేత 


చెన్నూరు ఆగస్టు 02 (వుదయం) Satish :   సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శనివారం రోజున నస్పూర్ కలెక్టరేట్ కార్యాలయంలో సాయంత్రం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పైళ్ల ఆశయ్య సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ..మంచిర్యాల జిల్లా చెన్నూరు బావురావు పేట శివారు సర్వే నెంబర్ 8 లో ఉన్న ప్రభుత్వ అసైన్డ్ భూమిలో నిరుపేదలైన ప్రజలు గత ఐదు నెలలుగా గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు.ఇది ఓర్వలేని కొంతమంది ఆ భూమిని కబ్జా చేసిన భూకబ్జాదారులు ఈరోజు ఉదయం  ఉదయం 9గం:లకు పేదల వేసుకున్న గుడిసెల్ని   200 మంది రౌడిలతో, గుండాలను పంపి ట్రాక్టర్లతో గుడిసెలను కూల్చి , పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. అడ్డుపోయిన మహిళలపై కూడా దాడులు చేసి, ఇష్టం వచ్చినట్టు చెడు మాటలతో తిట్టినారు.చెన్నూరు నడిబొడ్డులో ఇంత దాష్టీకానికి పాల్పడిన భూ కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే అరెస్టు చేయాలి.జిల్లా కలెక్టర్  పోలీసు ఉన్నతాధికారులు  తక్షణమే స్పందించి, అక్రమ పట్టాలను వెంటనే రద్దుచేసి, గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న పేదల ఇండ్లకు పట్టాలు ఇవ్వాలి.ఆ పేదలకు రక్షణ కల్పించాలి.లేకుంటే రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని  డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి,దాసరి రాజేశ్వరి, గోమాస ప్రకాష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,దుంపల రంజిత్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు, ఎండి అవిజ్ సిపిఎం చెన్నూరు పట్టణ కార్యదర్శి, సభ్యులు మహేష్,రాజేశ్వరి,బుదక్కా, మధు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.