:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / telangana / Yadadri Bhongir

మాకు ఎ పదవులు లేకున్నా ప్రజల కోసమే పని చేస్తున్నాం - బిర్లా, వైయస్సార్

By Naresh Babu | Posted on: 26-07-2023 12:07 | : 379



యాదాద్రి భువనగిరి / మోటకొండూర్ : జూలై వుదయం ప్రతినిధి : మాకు ఏ పదవులు లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ప్రజల కోసమే పని చేస్తున్నామని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బిర్లా ఐలయ్య, మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యేల్లంల సంజీవరెడ్డి అన్నారు. మోటకొండూర్ మండలంలో మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యేల్లంల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ముత్తిరెడ్డిగూడెం, చాడా, చామాపూర్, చందపల్లి గ్రామల్లో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి బీర్ల ఐలయ్య వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాటర్ క్యాన్లు పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన బీర్ల ఐలయ్య కి ఆయా గ్రామస్తులు శాలువాతో సన్మానించి పెద్దఎత్తున్న ఘన స్వాగతం పలికారు. ఈ సమావేశంలో బీర్ల ఐలయ్య, వైయస్సార్ లు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ప్రజలందరూ ఈసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. భావి ప్రధాని రాహుల్ గాంధీ రైతుల కోసం రైతు డిక్లరేషన్ చేయడం జరిగిందని. దీని ద్వారా రాబోయే రోజుల్లో రైతులకు పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా హైదరాబాదులో ప్రియాంక గాంధీ యువతకు యువ డిక్లరేషన్ చేయడం జరిగిందని ఈ యువ డిక్లరేషన్ వల్ల యువకులకు పెద్దపీటవేయునట్లు తెలిపారు.అదే విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే గ్రామాల్లో ఉందని, ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేయలేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చని ఈ సీఎంను గద్దె దింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్, జిల్లా కార్యదర్శి సిరిబోయిన మల్లేష్ యాదవ్, మాజీ జెడ్పిటిసి గంగాపురం మల్లేష్, మాజీ ఎంపీపీ వీసం వెంకటేశ్వర్లు, బ్లాక్ అధ్యకులు గుడిపాటి మసూదన్ రెడ్డి, ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం, సీనియర్ నాయకులు మదర్ గౌడ్, చాడ శశిధర్ రెడ్డి, రఘునాధ రాజు, సీలా బాలకృష్ణ, ఏనుగంటి శర్మ, రాజు యాదవ్, పి ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ జహంగీర్, ఉప సర్పంచులు మహేందర్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, ఆయా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్, శ్రీనివాస్, వల్లాల నవీన్, మాజీ సర్పంచ్ సుధాగాని జయరాములు గౌడ్, ఎన్న నర్సిరెడ్డి, దూదిపాల భాస్వారెడ్డి, మాజీ ఎంపిటిసి బోల్లపల్లి శ్రీనివాస్, బోట్ల నాగేష్, గుల్లపల్లి శ్రీశైలం, సంజీవ, ఎన్ ఎస్ యు ఐ నాయకులు రేగు రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.