:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / crime /

జెండా వందన సందర్భంగా ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు.... ఇరు వర్గాల ఘర్షణ... పలువురికి గాయాలు

By Admin | Posted on: 16-08-2021 09:08 | : 497



 

స్వాతంత్య్ర దినోత్సవం నాడు మూడు రంగుల జెండా ఎగురవేసిన సందర్భంగా కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు ముస్లిం వ్యతిరేక నినాదాలు చెయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తేజాజీ నగర్ ఓ అపార్ట్ మెంట్ లో భజరంగ్ దళ్ కు చెందిన పలువురు జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ముస్లింలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ కార్యక్రమం జరినంత సేపు ముస్లింలను రెచ్చగొడుతూ నినాదాలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఆ కార్యక్రమం పూర్తయ్యి ఇళ్ళకు మళ్ళే సమయంలో అదే అపార్ట్ మెంట్ లో ఉండే పలువురు మస్లింలు వీళ్ళపై రాళ్ళు రువ్వారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు ఘర్ష‌ణ జరిగింది.


సంఘటన సమాచారం తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరు వర్గాలు ఒకే అపార్ట్ మెంట్ లో నివసిస్తారని, జరిగిన సంఘట్నపై వీడియో ఫుటేజ్ చూస్తున్నామని , దర్యాప్తు తర్వాత నిందితులను అరెస్టు చేస్తామని పోలీసు సూపరింటెండెంట్ (SP) అశుతోష్ బగ్రి మీడియాకు చెప్పారు.