:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / movies /

ఆ ఇద్దరు మాత్రం తనని వదలడంలేదు - సమంత

By admin | Posted on: 13-05-2022 12:05 | : 215



ఎక్కడికి వెళ్లినా ఓ ఇద్దరు వ్యక్తులు తనని అస్సలు వదలడం లేదంటున్నారు బ్యూటీ క్వీన్ సమంత. ఓవైపు యాక్షన్, మరోవైపు ప్రేమ కథా చిత్రాల షూటింగ్స్ లో ఈ భామ ఫుల్ బిజీ అయ్యారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మీరోగా ఈసినిమా సిద్ధమవుతోంది. 

ఇదిలా ఉండగా.. షూటింగ్స్ తో బిజీగా ఉన్నప్పటికీ సామ్ టీమ్ మాత్రం ఫిట్ నెస్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. సమంత ఫిట్ గా ఉండేలా వాళ్లు అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నారు. షూటింగ్స్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సామ్ ఇన్ స్టాలో పోస్ట్ లు పెట్టారు. 

‘‘అమన్ కరానీ, జునైద్ షేక్ లతో నా మార్నింగ్స్. నేను ఎక్కడికి వెళ్లినా.. వీళ్ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నా. అన్నివిధాలుగా మంచి సౌకర్యాలు, రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు హోటల్ వారికి ధన్యవాదాలు. నేను వర్కౌట్లు చేసుకునేందుకు కావాల్సిన స్క్వాట్ ర్యాక్స్ ని బాల్ రూమ్ లోకి అనుమతించినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు’’ అని సమంత రాసారు.