:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / world /

తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు - ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్

By Admin | Posted on: 07-09-2021 16:09 | : 300



తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు.ఇకపై ఆ దేశం "ఇస్లామిక్ ఎమిరేట్" అని ప్రకటించారు.
తాలిబన్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ ప్రదానిగా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు.

హోంమంత్రిగా  హక్కానీ మిలిటెంట్ గ్రూప్ కు చెందిన సారాజుద్దీన్ హక్కానీ నియమితులయ్యాడు. ఇతను FBI- వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు.
రక్షణ మంత్రిగా ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రిగా అమీర్ ఖాన్ ముత్తాకీ నియమితులయ్యారు. తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్, ముల్లా అబ్దుల్ సలాం హనాఫీ ఇద్దరు డిప్యూటీలుగా  ఉంటారు.

ప్రభుత్వ ఏర్పాటు ప్రకటనను విడుదల చేసిన తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ,  "మన దేశ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. ఇప్పుడు నియమించబడిన ఈ బృందం  ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలిస్తుంది''అని అన్నారు.