:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / telangana / Yadadri Bhongir

కైలాసపురంలో విశేష పూజలు

By Naresh Babu | Posted on: 26-07-2023 12:07 | : 255



యాదాద్రి భువనగిరి / యాదగిరిగుట్ట : జూలై వుదయం ప్రతినిధి : యాదగిరిగుట్ట మండలం కాచారం కైలాస పురంలోని శ్రీ రేణుక వాసవి బసవ లింగేశ్వర దేవాలయంలో శ్రావణమాస రెండవ మంగళవారం పంచమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ జాతీయ నాయకుడు నారాయణపేట జిల్లా కోర్టు న్యాయవాది నారాయణపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కే సుజేంద్ర శెట్టి ధర్మపత్ని నారాయణపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళ జనరల్ సెక్రటరీ మేఘమాల దంపతులు, నారాయణ పేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కే రవీందర్ అరుణ దంపతులు పాల్గొని అమ్మవారికి చేరే సారే వడి బియ్యం సమర్పించి తమ మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు సుజేంద్ర శెట్టి మాట్లాడుతూ ఇంత దట్టమైన వనంల మధ్యలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సహజంగా దేవాలయంలో పూజారులు పూజా కైంకర్యాలు నిర్వహించి హారతి ఆశీర్వచనం ఇస్తుంటారని కానీ ఇక్కడి మహిమాన్వితమైన దేవాలయంలో భక్తులకు ఉన్న కోరికలను తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుండడం ఆ నోట ఈ నోట వింటూ ఈరోజు నేను ప్రత్యక్షంగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించి ప్రజలకు నా వంతుగా సేవ చేసే భాగ్యం కల్పించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో దేవాలయం నిర్మితమై గత మూడు దశాబ్దాలుగా అమ్మవారు పూజా కైంకర్యాలు అందుకొంటూ ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్యవైశ్య పూజారిగా డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఉండడం గర్వకారణమని కుటుంబ సమేతంగా దేవాలయానికి వచ్చి అమ్మవారికి చీర సారే మరియు ఒడి బియ్యం సమర్పణ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు వ్యాపారి చందా శ్రీనివాస్ గుప్తా జన్మదినం సందర్భంగా అన్నదానం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో గజ్వేల్ ఆర్యవైశ్య నాయకుడు తోట బిక్షపతి మరియు బీసీ సంఘం జాతీయ యువజన ఉపాధ్యక్షుడు సర్దార్ పంజాల వెంకట్ గౌడ్, ఎస్ ఎన్ న్యూస్ తెలుగు ఛానల్ సి ఎం డి సామ శ్రీధర్ దంపతులు మహాశివ భక్తుడు బచ్చు గణేష్ గజ్వేల్ ప్రముఖ పూజా సామాగ్రి వ్యాపారి గ్రంధం శ్రీనివాస దంపతులు కొంగరకలాన్ వాస్తవ్యులు నీల వెంకటేష్ రత్న శివ మనోరంజన్ నిత్య , రఘురంజన్ రక్షిత , కాకి బాలమణి వెంకటేష్, శివ కుమార్ నరేష్ , సాయి నికిత, బాల లక్ష్మి, హయత్ నగర్ వాస్తవ్యులు చెన్నగోని అంజయ్య గౌడ్ సుశీల తదితర భక్తులు పాల్గొన్నారు.