:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / telangana / Yadadri Bhongir

కల్లుగీత కార్మికులు అప్రమత్తంగా ఉండాలి - ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దీపిక గౌడ్

By Naresh Babu | Posted on: 26-07-2023 12:07 | : 407



యాదాద్రి భువనగిరి / జూలై వుదయం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కళ్ళుగీత కార్మికులందరూ అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దీపిక గౌడ్ తెలిపారు. వర్షం పడుతున్న సమయంలో తడిసిన చెట్లను ఎక్కరా దానీ తెలిపారు, పొలాల్లో ఉన్న విద్యుత్ లైన్ల దగ్గరలో ఉన్న మరియు తడిచిన చెట్లు ఎక్కరాదని, ఎక్కినట్లయితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. గీత కార్మికులు మధ్యతరగతి వారు అయినందున కళ్ళు గీసే సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారని తెలిపారు. గీత కార్మికులు ఈ వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నానని తెలిపారు. మీ అమూల్యమైన ప్రాణాలు మీ జీవనవృత్తులకు వెలకట్టలేని వని కొనియాడారు.