:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / crime /

ఐటీ ఉద్యోగులే టార్గెట్... పెళ్ళి చేసుకుంటానని మోసం... లక్షల రూపాయలు దోచుకున్న వైనం

By Admin | Posted on: 07-09-2021 06:09 | : 390



 

అతని పేరు పున్నాటి శ్రీనివాస్ అతనిది ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం కోటికాలపూడి గ్రామం. కాన్పూర్ లో ఎంటెక్ చదువు మధ్యలో మానేసి డబ్బుల సంపాదనలో పడ్డాడు. కష్టపడకుండా ఈజీగా డబ్బులొచ్చే మార్గాల కోసం అన్వేశించి చివరకు ఓ రూట్ ఎంచుకున్నాడు.

మ్యాట్రిమోనీ సైట్లు, డేటింగ్ యాప్ ల ద్వారా అమ్మాయిల ప్రొఫైల్ చెక్  చేస్తాడు. అందులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులనే కొందరిని ఎంచుకుంటాడు. వారితో పెళ్ళి సంబంధాలు మాట్లాడుతాడు. పెళ్ళికి ఓకే అనుకున్న తర్వాత మెల్లెగా అసలు విషయానికి వస్తాడు. సడెన్ గా కొన్ని ఆర్థిక ఇబ్బందులొచ్చాయని అర్జంట్ గా డబ్బులు సర్దుబాటు చేయమని మళ్ళి ఇచ్చేస్తానంటాడు. అలా అనేక మంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశాడు. ఒకే సారి అనేక మంది అమ్మాయిలతో ఇలా రిలేషన్ కొనసాగిస్తాడు. ఒక్కో అమ్మాయికి ఒక్కో సిమ్ కార్డ్ యూజ్ చేస్తాడు. 


తాజాగా ఒంగోలుకు చెందిన ఐటీ ఉద్యోగిని దగ్గర రూ. 27 లక్షలు ,నరసరావుపేటకు చెందిన ఐటీ ఉద్యోగిని దగ్గర రూ. 40 లక్షలు, చిత్తూరుకు చెందిన ఐటీ ఉద్యోగిని దగ్గర రూ.1.40 లక్షలు,  మదనపల్లెకు చెందిన యువ వైద్యురాలు దగ్గర రూ. 7 లక్షలు.. పున్నాటి శ్రీనివాస్ కొట్టేశాడు. అతని  ఖాతాలో డబ్బులు జమ కాగానే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇలా  మరో ఏడుగురు అమ్మాయిలు కూడా మోసపోయినట్లు తెలుస్తున్నా.. వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిసింది. అందరి దగ్గర కలిపి దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం.


చివరికి ఇతను చిత్తూరు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈయనపై హైదరాబాద్ లోని మియాపూర్, రాయదుర్గ్ పోలీసు స్టేషన్లలో కూడా పలు కేసులు నమోదయినట్టు చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు.