:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / world /

1 గంటలో దేశం మొత్తం కాలి నడకతో తిరిగి చూసేయవచ్చు..అది ఏ దేశమో తెలుసా..?

By Admin | Posted on: 17-05-2023 15:05 | : 225



ఏదైనా విహారయాత్రకు లేదంటే టూర్‌కు వెళితే కనీసం అక్కడున్న ఒక్క పట్టణాన్ని, టూరిస్ట్ ప్లేస్‌ని చూడటానికే ఒకటి రెండ్రోజులు సమయం పడుతుంది.

కాని గంటలో ఒక దేశాన్ని చుట్టి రావచ్చంటే నమ్ముతారా.. ఆ దేశం పేరు చెబితే నిజమే అంటారు.
వరల్డ్‌లో మొత్తం 195 దేశాలు ఉన్నాయి. భూభాగం పరంగా చూసుకుంటే రష్యా అతిపెద్ద దేశం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ప్రయాణం రెండు రష్యా సరిహద్దులను కలుపుతుంది. రైలు ప్రయాణం సుమారు 7 రోజులు పడుతుంది. వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం.
క్రైస్తవులకు పవిత్ర స్థలం, దేశంలో అతిపెద్ద రోమన్ క్యాథలిక్ చర్చిలలో ఒకటి, సెయింట్ పీటర్స్ బసిలికా. దీని చుట్టూ ప్రభుత్వ భవనం, మ్యూజియం, 2 చిన్న విద్యా సంస్థలు, కొన్ని ఇళ్లు మరియు దుకాణాలు ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం వైశాల్యం 0.17 చదరపు మైళ్ళు లేదా 0.44 చదరపు కిలోమీటర్లు మాత్రమే. చుట్టూ నడవడానికి 20 నిమిషాలు మాత్రమే పడుతుంది.

క్రైస్తవమత సామ్రాజ్యానికి ఇదొక కేంద్రం. సెయింట్ పీటర్ అపొస్తలుడి సమాధి, సుప్రీం పోంటీఫ్ ఇల్లు వంటివి ఈదేశానికి గుర్తింపు చిహ్నాలుగా నిలుస్తాయి. ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా ఉన్న వాటికన్ సిటీలో మొత్తం జనాబా సంఖ్య 825 మంది. గట్టిగా చెప్పాలంటే ఒక్కసారి చర్చి చుట్టూ తిరిగితే చాలు దేశ పర్యటన ముగిసినట్లే.అందుకే ఈదేశాన్ని తిరిగి చూడటం గంటలో పూర్తయ్యే పని.

వాటికన్ సిటీ దేశం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. వరల్డ్‌లో జైలు లేని ఏకైక దేశం ఇదే. ఇక్కడ ఎవరైనా నేరాలు చేసినా వారికి ఇటలీలో జైలు శిక్ష విధిస్తారు. చిన్న దేశం అయినప్పటికీ నేరాల రేటు చాలా ఎక్కువ.

ఈ చిన్న దేశంలో నివసిస్తున్న పోప్‌ను రక్షించడం వాటికన్ అధికారుల బాధ్యత కాదు. దాని కోసం పొంటిఫికల్ స్విస్ గార్డ్ అనే స్విస్ సైనికులు ఉన్నారు.

వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న రైలు మార్గాన్ని కలిగి ఉంది. స్టేషన్‌లో రెండు 300 మీటర్ల ట్రాక్‌లు మరియు ఒక రైల్వే స్టేషన్ ఉన్నాయి. వాటికన్ పూర్తిగా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడిన ఏకైక దేశం.