:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / movies /

ఆయన హీరో కృష్ణ

By admin | Posted on: 01-01-2023 02:01 | : 320



తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు ఎందరున్నా హీరో కృష్ణను మాత్రమే ప్రత్యేకంగా హీరో అనే పదం ముందు చేర్చి పిలుస్తారు. ఆయన పట్ల అభిమానంతో మాత్రమే కాదు, నిజ జీవితంలో అనేక విషయాలలో ఆయన వైఖరి కూడా హీరో లాగానే ఉంటుంది కనుకనే కృష్ణ ను హీరో కృష్ణ అని పిలిచేవారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లాంటి లెజెండ్స్ ఉన్నప్పటికీ హీరో అనే పదాన్ని కృష్ణ పేరు ముందు చేర్చి వ్రాయడం, పిలవడం, పలకడం జరిగేది. ఇప్పటితరం వారికి తెలియకపోయినా పాతతరం ప్రేక్షకులకు, సినీ అభిమానులకు ఇది తెలిసిన విషయమే. ఫిలిం జర్నలిస్టులు, క్రిటిక్స్, ఇప్పటి డిజిటల్ మీడియాలో ఆనాటి సినిమా ముచ్చట్లు చెప్పేవారు సైతం హీరో కృష్ణ అని సంబోధిస్తూ విషయం చెప్పడం ఇప్పటితరం వారూ గమనించవచ్చు. సినిమాయే లోకంగా, ప్రాణంగా బ్రతికిన హీరో కృష్ణ తన అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ హీరోగానే నిలిచి ఉంటారు