:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / telangana /

సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు ఏం చేశారో తెలుసా..?

By Admin | Posted on: 24-07-2023 14:07 | : 345



 


సిద్ధిపేట, జూలై 24: ఆయనొక అధికార పార్టీలో కీలక నేత.. పైగా రాష్ట్ర మంత్రి.. నిత్యం అధికార కార్యక్రమాలు, ప్రజా సమస్యలు.. పర్యటనలు.. నిత్యం బిజీబిజీగా ఉండే ఆయన.. ఇవాళ పరిసరాల పరిశుభ్రత – పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఉదయం వేళ పలు వార్డులలో తిరుగుతూ డ్రైనేజీలోని చెత్తను తానే స్వయంగా తీసి వేశారు. ఎవరా మంత్రి..? అని అనుకుంటున్నారా..? అయితే, ఆయన ఎవరో కాదు.. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు.. చెత్తను తొలగిద్దాం.. ఆరోగ్యంగా ఉందాం.. అనే కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణంలోని 18 వార్డులో సోమవారం ఉదయం పర్యటించారు. వీధి వీధి తిరుగుతూ.. వార్డులో కొన్ని చోట్ల ఉన్న చెత్తను తానే స్వయంగా తీసివేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే.. ఆరోగ్యం బాగుంటుంది అంటూ అందరికీ సూచించారు.


నడకతో ఆరోగ్యం.. చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం అనే నినాదంతో సిద్ధిపేట మున్సిపాలిటీ మరో సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. అలా వెళ్లిపోకుండా ఆ వార్డు మొత్తం తిరిగి, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు. మరో వైపు మురికి కాల్వల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, వాటర్, చాయ్ గ్లాసులు, శానిటరీ వేస్ట్ చెత్తను స్వయంగా మంత్రి హరీష్ రావు చేతితో ఎత్తి సంచిలో వేశారు.