:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / crime /

భార్య వేదింపులకన్నా జైలే నయం - పోలీసు స్టేషన్ కు నిప్పు పెట్టిన యువకుడు

By Admin | Posted on: 31-08-2021 07:08 | : 319



కొత్తగా పెళ్ళైన ఓ యువకుడు భార్యతో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని ఎన్నో కలలు కన్నాడు. కానీ పెళ్ళైన రెండవ రోజునుండే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతి రోజూ భార్య వేదింపులను తట్టుకోలేకపోయాడాయువకుడు. ఆ వేదింపులనుండి తప్పించుకోవాలంటే జైలుకెళ్ళడమే మార్గమనుకున్నాడు. ఏ నేరమూ చేయకుండా జైలుకెళ్ళడం సాధ్యం కాదు కదా! అందుకే ఆయన ఏకంగా పోలీసు స్టేషన్ కే నిప్పు పెట్టాడు. గుజరాత్ లో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది.

గుజరాత్, రాజ్‌కోట్‌ పట్టణంలోని జామ్‌నగర్‌ రోడ్డు రాజీవ్‌నగర్ లో నివసించే దేవ్జీ చావ్డ (23)కు ఇటీవలే పెళ్ళైంది. భార్యతీ కలిసి ఆనందంగా జీవితం గడుపుదామనుకున్న చావ్డకు ఆశ‌ నిరాశగానే మిగిలింది. ఇద్దరి మధ్య రోజూ గొడవలతో ఇల్లు నరకంలా తయారయ్యింది. భార్య వేదింపులను తట్టుకోలేకపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆమె వేదింపులు మానలేదు. ఇక ఆ వెదింపులు తాళలేక ఆయన దగ్గరలోని భజ్‌రంగ్‌ వాడి పోలీస్‌ ఔట్‌పోస్టుకు వెళ్ళి తనను అరెస్టు చేయాలని వేడుకున్నాడు. పోలీసులు వినకపోవడంతో ఇంటికి వెళ్ళి కిరోసిన్ తీసుకొని వచ్చి ఆ పోలీసు ఔట్ పోస్ట్ పై పోసి నిప్పంటించాడు. ఒకవైపు మంటలు రేగుతుంటే తనను అరెస్టు చేయాలంటూ చావ్డ అక్కడే నిలబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన‌ పోలీసులు మంటలను ఆర్పి దేవ్జీ చావ్డను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపినట్టు గాంధీగ్రామ్‌ సీఐ కుమాన్‌సిన్హ్‌ తెలిపారు.

ఇలా భార్య వేదింపుల నుంచి తప్పించుకోవడానికి పోలీసు స్టేషన్ కు నిప్పు పెట్టిన‌ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దేవ్జీ చావ్డపై నెటిజనులు సానుభూతి చూపిస్తున్నారు.