:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / crime /

లాకప్ లో మందు కొడుతూ విందు చేసుకున్న ఖైదీలు....వీడియో వైరల్

By Admin | Posted on: 26-08-2021 14:08 | : 207



జైల్లో ఉన్నవాళ్ళకు వాళ్ళ ఇంటిదగ్గర ఉన్నసౌకర్యాలు ఉండవని మనకు తెలుసు. కావాలనుకున్న భోజనం ఉండదు. విలాసాలుండవు. అక్కడ‌ జైలు అధికారుల అదుపాఙలతో జీవితం నడుస్తుంది. అయితే మన దేశంలో మాత్రం కొందరు అధికారుల జేబులు నింపితే ఖైదీలకు అన్ని విలాసాలు అందుబాటులో ఉంచుతారు. మందు, చిందుతో సహా ప్రతి ఒక్కటీ అందిస్తారు. 

ఈ మధ్య ఢిల్లీలో ఓ గ్యాంగ్ స్టర్ అనుచరులు లాకప్ లో మందు తాగుతూ, ఫోన్లుమాట్లాడుతూ దమ్ముకొడుతూ ఎంజాయ్ చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా అనుచరులు  రాహుల్ కాలా,  నవీన్ బాలి అనే వాళ్ళు లాకప్ లోపల కూర్చుని మద్యం తాగుతూ,  స్నాక్స్ తింటూ , దమ్ము కొడుతూ, ఫోన్లు మాట్లాడుతున్న‌ ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఇద్దరు ఆగస్టు 5 న అరెస్టయ్యారు. ఆగస్టు 10 వరకు పోలీసు రిమాండ్ విధించారు. వీళ్ళు హత్యలు, కిడ్నాప్ లు, బెదిరించి డబ్బులు గుంజడం తదితర అనేక నేరాలకు పాల్పడ్డారు. గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా కోసం వీళ్ళు పనిచేస్తుంటారు. 

అయితే వీళ్ళిద్దరు లాకప్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు జైలులోనా లేక పోలీసు లాకప్ లోనా అన్న విషయం తెలియరాలేదు. 
24 సెకన్ల ఈ వీడియోలో రాహుల్,  నవీన్‌తో కలిసి పోలీసు లాకప్‌లో నలుగురు వ్యక్తులు కూర్చొని మద్యం, చిప్స్ మరియు ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటున్నట్లు కనపడుతుంది. వీళ్ళు ఒక పరుపుపై ​​కూర్చుని కనిపిస్తారు, అలాగే ఫోన్‌లో మాట్లాడటం, ధూమపానం చేయడం కూడా కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు లాక్-అప్ వెలుపల కూర్చొని ఉన్నట్లు చూడవచ్చు.

దీనిపై డీజీ (తీహార్ జైలు) ని సంప్రదించినప్పుడు, "మేము దానిని పరిశీలిస్తాము" అని చెప్పాడు. ఢిల్లీ పోలీసు అధికార ప్రతినిధి చిన్మోయ్ బిస్వాల్ మాట్లాడుతూ, "వీడియో ఇంకా నిర్దారణ్ అకాలేదు అలాగే పోలీసు లాకప్‌లో మద్యం అనుమతించబడదు." అని అన్నాడు.