:: Voodayam Telugu Daily - Andhra Pradesh | Telangana | Telugu News | Breaking News ::
Home / movies /

సినీ ప్రియులకు పండుగ.. ఓటీటీ రిలీజ్ కు ఆర్ఆర్ఆర్ రెడీ

By admin | Posted on: 12-05-2022 05:05 | : 315



సినీ ప్రియుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ  'ఆర్ఆర్ఆర్'  డిజిటల్ ప్రిమియర్ కు రంగం సిద్ధమైంది. మరో వారం రోజుల్లో  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. 

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.  మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసును కొల్లగొట్టింది. రూ.1000 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ఇద్దరు పెద్ద హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడంతో మరింత ఆసక్తి పెరిగింది. థియేటర్లలో చూసిన ప్రేక్షకులు ఓటీటీలో కూడా చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5..  'ఆర్ఆర్ఆర్' డిజిటల్ ప్రిమియర్ డేట్ ని ప్రకటించింది. మే 20 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో  'ఆర్ఆర్ఆర్'  తమ ప్లాట్ ఫామ్ వేదికగా అందుబాటులోకి రానుందని ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ , రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే అదే రోజు కావడంతో  'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ తమకెంతో స్పెషల్ అని ఆయన అభిమానులు అంటున్నారు.